Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

520..
రెప్ప మూసి తెరచులోపు ~ అలిగిపోవు సఖివి నీవు..!
అరమూసిన కనులవనము ~ కరిగిపోవు సఖివి నీవు..!
నిను గెలువగ నాతరమే ~ ప్రాణదీప నయనతార..!
నా తెలివిని గమనిస్తూ ~ నవ్విపోవు సఖివి నీవు..!
ఈ జీవిత పరమార్థం ~ వివరించగ వేడుకొందు..!
బ్రతుకుపాట సంగతులను ~ నేర్పిపోవుసఖివి నీవు..!
కలహంసల మేఘమాల ~ కానుకేల చేస్తావో..?!
నా శ్వాసల పొదరింటిని ~ నిలిపిపోవు సఖివి నీవు..!
కంటిపాప గుండెలోన ~ కదలాడే కావ్యసాక్షి..!
మింటికెగయు వలపులన్ని ~ తీర్చిపోవు సఖివి నీవు..!
ఆ'రాధా పెదవులపై ~ కెంపులనే లాలింతువు..!
ప్రియ 'మాధవ' హృదయజలధి ~ తేలిపోవు సఖివి నీవు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

కరిగిపోవు సఖివి నీవు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.