Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


521..
కాలానికి సాక్షియైన ~ కంటిపాప ఏమనునిక..?!
కనుమలగని యోగియైన ~ కంటిపాప ఏమనునిక..?!
అద్దమంటి మనసులోతు ~ ఎవరు పట్టి చూపేరో..!?
ఎద కోవెల మౌనియైన ~ కంటిపాప ఏమనునిక..?!
కలల ఇంద్రధనువులనే ~ పండించే దీక్ష పూనె..!
కలతపడని భోగియైన ~ కంటిపాప ఏమనునిక..?!
జాలువారు కన్నీటిని ~ ఏ నదిగా వర్ణింతువు..?!
దృశ్యకావ్య త్యాగియైన ~ కంటిపాప ఏమనునిక..?!
మనసుకథా జలధిసుధను ~ వర్షించే జాబిలిరో..!
నిత్యసత్య సరసియైన ~ కంటిపాప ఏమనునిక..?!
'మాధవు'డా..! ఓ మయూర పింఛధారి చూడుమింక..!
బృందావనవాటియైన ~ కంటిపాప ఏమనునిక..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఏమనునిక
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.