Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

 522..
చిత్రమైన చూపులలో ~ ఎన్ని ముళ్ళ చక్రాలో..?!
అందమైన ఆశలలో ~ ఎన్ని ముళ్ళ చక్రాలో..?!
జన్మలెన్ని గడచినాయొ ~ శ్వాసదారి తెలియకనే..!
కలతచెందు కన్నులలో ~ ఎన్ని ముళ్ళ చక్రాలో..?!
యాంత్రికతకు మురిసిపోతు ~ ఎలా అలసిపోయామో..?!
అమాయకపు బ్రతుకులలో ~ ఎన్ని ముళ్ళ చక్రాలో..?!
ఆకలితో అల్లాడే ~ జీవుల గతి ఎట్లుండును..!?
రగులుతున్న గుండెలలో ~ ఎన్ని ముళ్ళ చక్రాలో..?!
అవినీతికి గొడుగు పట్టి ~ గద్దె నిలుపు దొరలెందుకు..?!
పదవిమోజు నవ్వులలో ~ఎన్ని ముళ్ళ చక్రాలో..?!
'మాధవు'నకు తెలియకుండ ~ ఏమి జరుగునీ జగమున..?!
పాపభీతి లోతులలో ~ ఎన్ని ముళ్ళ చక్రాలో..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ఎన్ని ముళ్ళ చక్రాలో
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.