Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

524..
నిదురరాని నీలి కనుల ~ భాష చూప వీలౌనా..!?
గుండెగంట ఆ వలపుల ~ గొడవ చూప వీలౌనా..!?
రైతుకంట జారునీట ~ తడిసేనా పంటపొలం..?!
సాయమవని ప్రభుత నిధుల ~ జాడ చూప వీలౌనా..?!
ప్రతి మనస్సు ప్రేమతోట ~ విరిసేనా కన్నీటను..?!
చెలియసొగసు గగనమ్ముల ~ మేడ చూప వీలౌనా..!?
చదువుకొనే పాపాయిల ~ సంచి బరువు తంటాలా..!!
జ్ఞాపకాల తన్నులాట ~ ఘోష చూప వీలౌనా..!?
రాజకీయ నాయకులకు ~ సమస్యలకు లోటు లేదు..!
గురి తప్పని కుంభకోణ ~ మేధ చూప వీలౌనా..!?
ఆ 'మాధవ' చాతుర్యము ~ నేర్చుకొనగ అబ్బేనా..?!
కణ కణమున దాగియున్న ~ చరిత చూప వీలౌనా..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

భాష చూప వీలౌనా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.