Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

526..
వాకిలికి చెప్పాను.. నీ రాక తెల్పమని..!
ఆకలికి చెప్పాను..నా జోలి మానమని..!
నువులేక ఎందుకో..క్షణమైన ఈ శ్వాస..?!
మనసుకే చెప్పాను..తన గొడవ ఆపమని..!
వెన్నెలకు తెలియకే..నవ్వునా నను చూసి..!?
జాబిలికి చెప్పాను..నీ జాడ చూపమని..!
ఏ కొండ కోనలో..ఏల దాగున్నావో..?!
ఆ గాలికి చెప్పాను..నిను జతగ కలపమని..!
ఏ యజ్ఞ వాటిలో..నను సమిధ చేతువో..?!
వనాలకి చెప్పాను..నీ ఒడిని నిలపమని..!
ప్రేమతో మురిపించు.. ప్రియ మురళి'మాధవా'..! 
యమునతో చెప్పాను..విరహమిక మాన్పమని..

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

మనసుకే చెప్పాను
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.