Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

528..
తియ్యని ఈ ఊపిరితో..ఎన్ని బొమ్మలాటలో..!?
జన్మకలల జాబిలితో..ఎన్ని బొమ్మలాటలో..!?
కమ్మనైన బ్రతుకుపాట..దారి చూపు కోమలీ..!
ప్రాణదీప మోహినితో..ఎన్ని బొమ్మలాటలో..!?
ఎదురొచ్చే జ్ఞాపకాల..చెలమసాక్షి చెలియవే..!
తనూలతిక రంజనితో..ఎన్ని బొమ్మలాటలో..!?
విరహానికి తావెక్కడ..నా నీడై ఉంటివే..!
నిత్యస్వర్ణ మంజరితో..ఎన్ని బొమ్మలాటలో..!?
అంతులేని సరసాలకు..కోవెలైన ప్రేయసీ ..!
దివ్యమందహాసినితో..ఎన్ని బొమ్మలాటలో..!?
ఆ'మాధవ' ఆరాధవు..నిండినావు మనసులో..!
సత్యగగన మాధురితో..ఎన్ని బొమ్మలాటలో..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఎన్ని బొమ్మలాటలో.
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.