Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

532..
నిప్పుకే శాసనం..వ్రాయాలి కవి కలం..!
వేకువకు ఆసనం..వేయాలి కవి కలం..!
ఏ ఎండకా గొడుగు..పట్టడం దేనికట..!?
సద్యోగ విప్లవం..సలపాలి కవి కలం..!
తిరగేసి..మరగేసి..ఉతికేదె అక్షరం..!
సురక్షా కేతనం..ఎత్తాలి కవి కలం..!
శాంతినే స్థాపించు..మార్గమే తనదిగా..
నిజమైత్రి సాధనం కావాలి కవి కలం..!
లోలోన ఓషధులు..పండించు వెన్నెలకు.. 
ప్రేమగా స్వాగతం పలకాలి కవి కలం..!
'మాధవు'ని ధ్యానమే.. విశ్వమును నడిపించ..
అహరహం అంకితం..అవ్వాలి కవి కలం..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

.వ్రాయాలి కవి కలం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.