Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

533..
అమ్మ చూపు ప్రేమంతా.. ముద్దుగానె మారుతోంది..!
ఆమె చేతి చలువంతా..శక్తిగానె మారుతోంది..!
ఎంత గొడవ చేస్తుందో..ఒక్కపూట తినకుంటే..
ఆమె వేయు ప్రతి అడుగూ..దారిగానె మారుతోంది..!
ఎలా జోల పాడిందో..సేవలెన్ని చేసిందో..?!
ఆమె ఆశ అందమైన..తోటగానె మారుతోంది..!.
ఎంత తపసు సలిపిందో..నోములేన్ని నోచిందో..!?
ఆమెలోని సహనధనం..లాలిగానె మారుతోంది..!
బిడ్డ చేయు మారాముకు..ఎలా నవ్వుకుంటుందో..?!
ఆమె పెట్టు హద్దైనా..హాయిగానె మారుతోంది..!
చల్లచేయు అమ్మ వెనుక..చేరాడా 'మాధవు'డు..!
ఆమె తీయు వెన్నంతా..మాయగానె మారుతోంది..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ముద్దుగానె మారుతోంది
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.