Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

534 ..
నాన్న మాటలోని శక్తి..వెలుగుగానె మారుతోంది..!
అతని కంటిలోని ఎరుపు..మెట్టుగానె మారుతోంది..!
ఎంత శ్రమను చేస్తాడో..తన సుఖమే మరచిపోయి..
అతని స్వేద ఫలమేమో..గొడుగుగానె మారుతోంది..!
తన బాధ్యత మరువకుండ..ప్రేమమేఘ మౌతాడే..!
అతని మౌన సాధనేమొ..యేరుగానె మారుతోంది..!
ఎవ్వరేమి అనుకున్నా..తనబిడ్దల మేలు చూడ..
అంకితమౌ తీరేమో..తపముగానెమారుతోంది..!
చిన్ననాటి నుండె నాన్న..నేస్తమౌను ప్రతిక్షణం..
వేలుపట్టి నడుపుతీరు..జయముగానె మారుతోంది..!
'మాధవు'నకు పూజసేయు..తండ్రి కోర్కె ఏముండును..?!
అతని మనసు చూస్తుంటే..వెన్నగానె మారుతోంది..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

వెలుగుగానె మారుతోంది
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.