Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

537..
వేదించే కాలమింక ~ తియ్యగానె మారుతోంది..!
సాధనలో మనసు కాస్త ~ ఖాళిగానె మారుతోంది..!
నన్ను దాచుకున్నావుగ ~ నీ తియ్యని కన్నులలో..
వలపు ఇంద్రధనువేమో ~ మెరుపుగానే మారుతోంది..!
నిద్దురేమొ రాకున్నది ~ నీ తలపున నేనుంటే..
నడిరేయే కబురులాడు ~ పగటిగానె మారుతోంది..!
కరువుతీర ముద్దులాడు ~ వెన్నెలతో కబురులేల..
మంచు కూడ తాకలేని ~ నిప్పుగానె మారుతోంది..!
జాబిలికే జోలపాడు~ తియ్యనైన చెలి నీవే..
నీవు లేక ఈ రేయే ~ చేదుగానె మారుతోంది..!
ఎంత నీవు కాదన్నా ~ నీవాడను 'మాధవు'డా..
తెలుసుకున్నఈ వేళయె ~ అశగానె మారుతోంది..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

తియ్యగానె మారుతోంది
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.