Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

541..
నీవు పరచుకున్న ముళ్ళు ..ఎవరు ఏరివేస్తారట..?!
మనసులోన ఉన్న తుళ్లు..ఎవరు ఆపివేస్తారట..?!
అసలు మౌననిధి కోవెల..చేరు దారి పట్టుమింక..!
నొప్పించే 'పలుకు'రాళ్ళు..ఎవరు నిలిపివేస్తారట..?!
అన్ని ఉన్న అంగట్లో..శని అంటే అజ్ఞానం..!
నీ తలపై గంగ నీళ్ళు..ఎవరు తెచ్చి పోస్తారట..?!
లోలోపలి తీర్థాలను..దేవుళ్ళను చూడవేమి..!?
తెరచియున్న రెండు కళ్ళు..ఎవరు పట్టి మూస్తారట..!?
అందమైన ఏకాంతపు ఆకాశం సాక్షి కదా..!
శ్వాస తరువు వెలుగు పళ్ళు..ఎవరు కోసి ఇస్తారట..?!
నిజ'మాధవ' బృందావన మీ తనువే ఓ నేస్తం..!
నీ కర్మల రంగురాళ్ళు ..ఎవరు బూది చేస్తారట..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఎవరు ఏరివేస్తారట
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.