Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

542..
మెరుపు పూల ఎదలోయల ~ నీ తియ్యని సంతకాలు..!
ఆ మయూర నాట్యలయల ~ నీ తరగని సంతకాలు..!
ఇంద్రచాప సంగీతం ~ వింటున్నా నీ చూపుల..!
మౌనజలధి స్వరసీమల ~ నీ వాడని సంతకాలు..!
ఎదురు చూచు కనురెప్పల ~ అలసటలకు తెర దించును..
పరిమళించు దీపశిఖల ~ నీ ఆరని సంతకాలు..!
అల అలలో అంతులేని ~ సిరిమువ్వల సవ్వడులే..!
లేతలేత హరితసుధల ~ నీ వెచ్చని సంతకాలు..!
సెలయేరుల పలకరించు ~ చిరునవ్వుల వీణ నీవు..!
కలహంసల తెలిరెక్కల ~ నీ కమ్మని సంతకాలు..!
'మాధవుడా' ఏమి మాయ ~ చేస్తావుర..ప్రతి రేయీ..!
శ్వాససాక్షి యోగప్రభల ~ నీ వీడని సంతకాలు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నీ తియ్యని సంతకాలు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.