Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

544
ఎంతమాయ చేస్తావో..వింతవిరహ.. గీతముతో..!
చిత్రముగా విచ్చేసీ..మధురవిరహ.. గీతముతో..!
ప్రియసఖితో మంతనాలు జరుపు వేళ ఆయెనుగా..!
ముచ్చటయే కరువయ్యిన..నిశలవిరహ.. గీతముతో..!
ఈ పానుపు కేమైనది..ముళ్ళు పరచినట్లున్నది..!?
తొలిరేయిని పండించగ..ప్రణయవిరహ గీతముతో..!
సరసమేదొ..? సౌఖ్యమెదో..ఎద నింపెడు వేడుకతో..!
చెలికత్తెను తోడు నిలిపె..మౌనవిరహ.. గీతముతో..!
చూపులనే ఆశలుగా..అల్లుకున్న నీ చెలియకు..
శ్వాసమాటు నాదాలకు..అమృతవిరహ.. గీతముతో..!
'మాధవు'నకు జాబు వ్రాయ..చేతకాని జాణనుగా..!
బృందావని హాసాలకు..ప్రేమవిరహ..గీతముతో..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

్రేమవిరహ..గీతముతో
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.