Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

545
వసివాడని నీ ప్రేమకు.. సలాం సలాం యువరాణీ..!
మసిబారని నీ కలలకు..సలాం సలాం యువరాణీ..!
నీ ముసిముసి నగవులసిరి..మెచ్చేయువ రాజెవరో..!?
నీ ప్రియవిభు శుభ రాకకు..సలాం సలాం యువరాణీ..!
ఆలోచన లోతులలో..అందముగా దాచినావె..!
అతని మదిని నీ బొమ్మకు..సలాం సలాం యువరాణీ..!
దిగవు పాన్పు ..తినవు ఏది..ఏమిటమ్మ నీ సంగతి..!?
తొలివలపుల పసి కూనకు..సలాం సలాం యువరాణీ..!
చిరుమొగ్గల వసంతాల కోవెలలో మరుమల్లివి నీవేలే..!
నీ తియ్యని పరువాలకు.. సలాం సలాం యువరాణీ..!
కరుణించే ఆ 'మాధవ' దేవునిపై అలుకలేల బంగారూ..!?
నీ పరిమళ ప్రణయాలకు..సలాం సలాం యువరాణీ..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

సలాం సలాం యువరాణీ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.