Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ కాన్వాస్..38-3.// 546 //
మోయలేని వలపులతో ఎదురుచూచు కోమలివా..?!
అందమైన తలపులతో..మనసు నిలుపు కోమలివా..?!
లేతలేత వసంతాల..పరువాలను విందుసేయ..!
యవ్వనాల పిలుపులతో..పరవశించు కోమలివా..?!
నీ రాజే నెలరాజై..వచ్చునులే సమయానికి..!
తూచలేని నవ్వులతో..ఊయలూగు కోమలివా..?!
సరసాలకు తెర తీయగ..తియ్యనైన ఓ సఖియా..!
మురిపించే మధువులతో..కళలు నింపు కోమలివా..!?
దరి చేరే విరహాలకు..స్వస్తి పలుకు నెరజాణవు..!
ఆ 'మాధవ' పలుకులతో..తేలిపోవు కోమలివా..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు


 

ఎదురుచూచు కోమలివా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.