Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

554..
అనుభవాల తేనియలను.. కురిసి వెళ్ళినావు కదా..!
అందమైన దారేదో..వేసి వెళ్ళినావు కదా..!
నిన్నంటే గత క్షణం..నేడంటే ఈ'క్షణమే..!
జ్ఞాపకాల పూలతోట..నిలిపి వెళ్ళినావు కదా..!
రేపటితో అనుబంధమె..మరుక్షణం అనుక్షణం..!
నీతో నా చెలిమిబాట..చూపి వెళ్ళినావు కదా..!
ఏ క్షణమూ నిను మరువక..స్వాగతింతు మధురముగా..
యుగయుగాల చెలిమి పాట..నేర్పి వెళ్ళినావు కదా..!
కనురెప్పల కొలువుసాక్షి ..బహు చక్కని చిత్రసీమ..
పెను నిద్దుర నిఘంటువున..దాచి వెళ్ళినావు కదా..!
క్రొత్తవర్ష మొచ్చేనను ..ఆనందం అందించే 'మాధవుడా'..!
మోయలేని విరహాలను..దించి వెళ్ళినావు కదా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

వెళ్ళినావు కదా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.