Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

555..
చూపులలో బాంబులలా..గుప్పించుట మానాలిక..!
మాటలతో ఎవరినైన..నొప్పించుట మానాలిక..!
విమర్శ అది ఏదైనా..చేమంతుల జల్లేలే..!
పొగడ్తలను కిరీటాలు..ధరియించుట మానాలిక..!
బద్దకాన్ని పెంచేందుకు..సౌఖ్యమెంత తియ్యనిదో..?!
ఆదుకునే గుణమేదో..తప్పించుట మానాలిక..!
స్నేహానికి పరితపించు..మనిషే మరి దైవములే..!
పులుముకునే హాసాలను..కురిపించుట మానాలిక..!
మౌననిధికి నడిపించే..దారిదీప మెక్కడుంది..!?
తోటివారి నెపుడైనా..విసిగించుట మానాలిక..!
మనసుమాటు 'మాధవు'డే..గమనించును నీ చర్యలు..! 
బ్రతుకన్నది బరువుగా..భావించుట మానాలిక..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

మానాలిక
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.