Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

559..
ఆత్మీయ నేస్తాలకు..2016 హాపీ న్యూ ఇయర్..శుభాకాంక్షలతో..
ఉదయించే కిరణాలకు శిరసు వంచి స్వాగతాలు..!
ఎదురొచ్చే హాసాలకు మనసు పెట్టి స్వాగతాలు..!
కాలగర్భ మెక్కడుందొ..ఏ శాస్త్రం చెబుతుందట..!?
క్రొత్తదనపు చరణాలకు..కలము పట్టి స్వాగతాలు..!
అనుభవాల వేదాలకు..అనువాదాలుంటాయా..!?
మాతృత్వపు హృదయాలకు..తలపు నిలిపి స్వాగతాలు..!
గురుతత్వపు కోవెలలో తపములెవరు సలిపేరో..?!
మౌనగగన మేఘాలకు..చేతులెత్తి స్వాగతాలు..!
మంత్రించే చూపులతో..చెలిమినెవరు పంచేరో..!?
అవిశ్రాంత నేస్తాలకు..పదములంటి స్వాగతాలు..!
పండుగంటి పూలదారి చూపే ఓ'మాధవుడా'..!
నీదువేణు నాదాలకు..కనులు మూసి స్వాగతాలు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

స్వాగతాలు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.