Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

561..
మెరుపులతకు నాట్యాలను..పొదుగువాడు ఎవడోయీ..!?
మధురోహల శిల్పాలను..చెక్కువాడు ఎవడోయీ..!?
పరుగులిడే మబ్బుకన్నె..పరువాలకు పగ్గాలా..?!
చిరునవ్వుల దీపాలను..నిలుపువాడు ఎవడోయీ..!?
వలపుతేనె వాగులేలు..జాబిలినే పట్టాలా..?!
మధురప్రణయ కావ్యాలను..వ్రాయువాడు ఎవడోయీ..!?
సంశయాల సందోహము..నిలువరింప కుదిరేనా..?!
మదివరించు స్వప్నాలను..చూచువాడు ఎవడోయీ..!?
మౌనశాస్త్ర అనువాదం..చేసేందుకు సాహసమా..?!
జ్ఞానగగన తీరాలను..చేర్చువాడు ఎవడోయీ..!?
నీటిపైని గీతలాగ..బ్రతుకు గడుపు ''మాధవుడా''..!
అసలు నిప్పు దారాలను..అల్లువాడు ఎవడోయీ..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

.పొదుగువాడు ఎవడోయీ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.