Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

562..
వ్యాఖ్యానపు జలధులలో..ఈదులాడ వాదేలా..?!
కాంతిపూల వనములలో..చిందులాడ వాదేలా..?!
ఎవరికెవరు ఎమౌదురొ..!..చెలిమి కన్న సంపదేమి..?!
పలకరించు గాలులతో..ముద్దులాడ వాదేలా..?!
చినుకుపూల హాసాలను..తేనియలుగ పొందేమే..!
నీలిమబ్బు నీడలతో..ఊసులాడ వాదేలా..?!
ఇంద్రధనువు పరువాలను..వర్ణించే పని ఏమి..?!
నిదురెరుగని జాబిలితో..ఆటలాడ వాదేలా..?!
పారిజాత సోయగాల..రసజగమే ఏలాలా..!?
నవవసంత మాధురితో..నటనలాడ వాదేలా..?!
చిరునవ్వుల వేణువూదు..'మాధవు'డే నీవైతే..!
ప్రణయకావ్య నాయికతో..చతురులాడ వాదేలా..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఈదులాడ వాదేలా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.