Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

572..
సాయమేమి చేస్తావోయ్..చేసి చూడు వ్యవసాయం..! 
ప్రతిపొలమున జరగాలి..మరి ''పిరమిడు'' వ్యవసాయం..!
పండ్లు కూరగాయాలనే..ఎక్కువగా తినవలెనోయ్..
ప్రతి ఇంటా బహు చక్కని..ఆరోగ్యపు వ్యవసాయం..!
మనశ్శాంతి కావాలని..మనసు గూర్చి తెలియవేమి ?!
ఆలోచన సరిచేయగ..ఆనందపు వ్యవసాయం..!
మట్టితోటి నీళ్ళతోటి ఆడుకునే సంగతేది..!?
కురియు వానమబ్బులలో తనువు తడుపు వ్యవసాయం..!
ధ్యానమంటె సహజమైన ప్రకృతితో ఉండటమే..!
శ్వాస కన్న మిత్రుడెవరు..కలసి సాగు వ్యవసాయం..!
చిరునవ్వుల విత్తనాలు స్నేహంగా పంచటమే..
'మాధవు'నకు ఇష్టమదే..ముక్తినిచ్చు వ్యవసాయం..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

వ్యవసాయం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.