Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


578..
చినుకుపూల రథముమల్లె..మిగులుటయే.. గురుతత్వం..!
చిరునవ్వుల జల్లుమల్లె..సాగుటయే..గురుతత్వం..!
ఎవ్వరేమి అనేసినా..అనుకున్నా మాటేగా..!
మాటమాటు మౌనమల్లె..వెలుగుటయే..గురుతత్వం..!
అమృతమధుర రాగాలకు..స్పందించే నీవెవరో..?!
నీకు నీవు సాక్షిమల్లె..నిలచుటయే..గురుతత్వం..!
అలరించే గీతాలే.. ఆగ్నిపూలు కురిసేనా..?!
రుచుల మాటు శ్వాసలోతు అందుటయే..గురుతత్వం..!
పరిమళించు రాలుపూల.. గాలిగుండె లయ వినగా..
శ్రీ చందన గంధమ్ముల.. నిండుటయే..గురుతత్వం..!
ఆ 'మాధవ' హాస శృతిని.. సవరించగ తరమౌనా..!?
విశ్వప్రేమ స్వరగతులను..కురియుటయే..గురుతత్వం..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

గురుతత్వం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.