Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

580 //
కాంతిలోక లతవు నీవు..కలతదేల పూల బాల..!?
భువికి దిగిన దెందులకో..మరపదేల పూల బాల..!?
మోడు చూడు విరగబూసె..నీవు తనను చేరగానె..!
మనసులోని భావమేదొ..తెలుపదేల పూల బాల..!?
ముచ్చటైన దేవకాంత..నీవైతే వగపేలా..?!
ప్రియుని జాడ తెలియునులే..చింతదేల పూల బాల..!?
నిన్ను నీవు తెలుసుకోగ..సమయమాయె చిన్నదాన..!
నిప్పులాంటి భవిత చూడ..వెరపదేల పూల బాల..!?
వసంతాలు కరిగిపోయె..యవ్వనాలు కాలిపోయె..!
ప్రేమోదయ సంధ్య ఇదే..తెలియదేల పూల బాల..!?
పలకరించు ఆ'మాధవ' వేణువేది ఓ రాధా..!?
బృందావని అడుగుతుంటె..పలుకదేల పూల బాల..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

పూల బాల
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.