Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

581..
మనసు లోతు చూసేందుకు.. కనులు తెరచి వెతుకుటేల..?!
రుచుల తోట చిరునామా..పట్టు కొరకు గతుకుటేల..!?
ఆరాటపు వసంతాల..చిత్రసీమ మురిసేవా..!?
యుగయుగాల పర్యంతం..పరుగు తీస్తు చితుకుటేల..!?
ప్రతి'బింబపు కొవెలలను..కోరుకునే ప్రేమకేమి..?!
మతిమాలిన బహు'మతులను..ఆశిస్తూ..బ్రతుకుటేల..!?
గంతులిడే లేగ త్రాగు..పాలకన్న శ్రేష్టమేమి..?!
స్వచ్చమైన ప్రేమవేద నాదాలను..పితుకుటేల..!?
అంతరంగ జగతిలోన ఉన్న శక్తి మాటలదా..?!
అక్షరాల మౌనగగన కాంతిలతలు..అతుకుటేల..?!
'మాధవు'నకు తెలియకుండ నీవు చేయు సాధనేమి..?!
వేణుగాన స్వర ఝరులను అదేపనిగ..ఉతుకుటేల..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

వెతుకుటేల
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.