Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

586..
నీ గాలిని నీకు పట్టి..ఇవ్వలేరు వేరెవ్వరు.. !
నీ నేలను నీకు గాక.. చేయలేరు వేరెవ్వరు.. !
అనవసరపు హైరానా..అజ్ఞానం మూలంగా..!
నీవు పడే..వేదనలను..తీర్చలేరు వేరెవ్వరు.. !
నీతో నా అనుబంధం..మాటలలో చెప్పేదా..!?
వెన్నెలంటి నీ స్నేహం..తుంచలేరు వేరెవ్వరు.. !
తనువేలా వీడినావొ..ఇప్పుడు నీ లోకమెదో..!?
నీ తలపుల పూలతోట..కాల్చలేరు వేరెవ్వరు.. !
మృత్యువుతో పోరాటం..కాదు సుమా బ్రతుకంటే..!
నీ ఆశయ సౌధాలను..కూల్చలేరు వేరెవ్వరు..!
ఇంద్రధనువు నినుచేయగ..బిందువునే నేనౌతా..!
నీ శ్వాసల 'మాధవ'నిధి..దోచలేరు వేరెవ్వరు.. !

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

వేరెవ్వరు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.