Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

587..
చిన్నిపాప నవ్వులకే..కులం రంగు పూస్తావేం..!?
మోముచూపు అద్దానికి..మతం రంగు పూస్తావేం..?!
అమాయకత చిరునామా..కోడికూతలో ఉందే..!
మేలుకొలుపు వేకువకే..భయం రంగు పూస్తావేం..?!
ఆకలికే బలి అయ్యే..నిరుపేద కన్నుల్లో..
మృత్యువేద నాదానికి..స్వరం రంగు పూస్తావేం..!?
శరత్కాల వెన్నెలలో..పొన్ననీడ ఉన్నదెవరొ..?!
ప్రేమబాల పారాణికి..ధనం రంగు పూస్తావేం..!?
నరికితినే నరకుల కథ..తిరగవ్రాయు రోజొచ్చెను..!
సత్యవ్రతుల వాక్కులకే..విషం రంగు పూస్తావేం..!?
ఆహుతయే స్వప్నాలను..కావ్యాలుగ మలచాలిక..!
ఆ'మాధవ' తత్వానికి..అహం రంగు పూస్తావేం..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

రంగు పూస్తావేం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.