Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

590..
ప్రశాంతతను పొందేందుకు.. ధేనువుతో ధ్యాన'మేను..!
శక్తివంత మయ్యేందుకు..సౌఖ్యముతో ధ్యాన'మేను..!
వేళ్ళల్లో వేళ్ళు కలిపి..సుఖాసనం ఐతే సరి..!
మూడవ'కను' విరిసేందుకు..సత్యముతో ధ్యాన'మేను..!
ఎండైనా..వానైనా..చలియైనా సమస్యేమి..?!
పనిచేయగ సాగేందుకు..ఇష్టముతో ధ్యాన'మేను..!
గోమాతను సేవించిన..అమ్మప్రేమ విలువ తెలియు..!
విజయపథము దొరికేందుకు..భావముతో ధ్యాన'మేను..!
గోపాదము సోకినంత..పులకించును భూమాతయె..!
వేదసుధలు అందేందుకు..నాదముతో ధ్యాన'మేను..!
గో'శ్వాసను..అనుసరించు..మానవుడే 'మాధవు'డగు..!
స్నేహ వేణు వూదేందుకు..సేద్యముతో ధ్యానమేను..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

అమ్మప్రేమ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.