Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


// 592 //
పాడుతున్న పైరగాలి..కురులవీణ శృతి చేసెను..!
నవ్వుతున్న తోటమాలి..స్వప్నవీణ శృతి చేసెను..!
నేను డాక్టరవ్వాలని..తాను కన్న కల నిజమై..
సంక్రాంతుల దీపావళి..మరులవీణ శృతి చేసెను..!
పొలము దున్ను నాబావకు..నేనంటే ఎంతిష్టమొ..!?
ఊరి ప్రజల హితము కోరి..స్నేహవీణ శృతి చేసెను..!
అసలు 'ప్రేమ' చిరునామా..దాగున్నది తన శ్వాసన..!
జీవులన్ని తన సమమని..మౌనవీణ శృతి చేసెను..!
అతని హృదయ సీమలోన..వెలుగుదివ్వెనైన చాలు..!
ఆ పున్నమి వెన్నెలగని..ప్రణయవీణ శృతి చేసెను..!
నా పాలిట 'మాధవు'డే..మా పల్లెకు మహరాజే..!
తన జీవన లక్ష్యమ్మని..సమతవీణ శృతి చేసెను..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

శృతి చేసెను
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.