Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


593..
కనుపాపల భాషేదో..రెప్పలెట్ల తెల్పుతాయి..?!
గాలి ఎదన గొడవేదో..శ్వాసలెట్ల తెల్పుతాయి..?!
ప్రేమదారి నడిపేదీ..ప్రేమగాక మరి ఏదో..!?
స్నేహానికి గడపేదో..చూపులెట్ల తెల్పుతాయి..?!
చిరునవ్వుల వెన్నెలలే..చెలికన్నులు కురిసేనా..?!
ఈ జీవన స్వరమేదో..పలుకులెట్ల తెల్పుతాయి..?!
ఆమె మనసు తెలియాలని..వెర్రితనం ఎందుకటా..?!
తీపి మనోరథమేదో..పెదవులెట్ల తెల్పుతాయి..?!
మౌనసాక్షి అయ్యేందుకు..మానసమే తోడు సుమా..!
ఈ జగాన నిజమేదో..వలపులెట్ల తెల్పుతాయి..?!
'మాధవు'నకు నేర్పాలా..వేణువెలా ఊదాలో..?!
ప్రతి జన్మకు వరమేదో..ఊహలెట్ల తెల్పుతాయి..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

తెల్పుతాయి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.