Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@గజల్ కాన్వాస్..41-1.// 596..//
ఏ శక్తికి శక్తి లేదు..మన జంటను వేరుచేయ..!
ఏ దైవము వల్ల కాదు..మన మనసులు వేరుచేయ..!
గాలిదెంత జాలి గుండె..ప్రేమగూటి..సాక్షియౌను..!
అడ్డమైన రాచరికముల..చేతకాదు వేరుచేయ..!
నా ఎదలో వాడిపోని..జ్ఞాపకాల వనము నీవు..!
నడి ఎడారి..అర్థరాత్రి..చూడ'లేవు' వేరుచేయ..!
కంటిపాప జలధిలోన..నిదురించని దీపాలము..!
అగ్నివాన.. కలలతోట..భ్రమలు కాల్చు వేరుచేయ..!
మన చెలిమికి పరవశించి.. 'సినీవాలి' పానుపాయె..!
కులము,మతము..అధికారము తలచ'లేవు వేరుచేయ..!
'మాధవు'డే తోడు మనకు.. విరహమేల దరి చేరును..!?
మృత్యువైన భీతి చెందు..మన నీడలు వేరుచేయ..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

వేరుచేయ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.