Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ కాన్వాస్..41-2.// 597..//
చెలి ఊపిరి ఊయలలో ~ నను నిలిపిన ఓ చాంద్'నీ..!!
యుగయుగాల సంకెళ్ళను ~ భలె త్రెంచిన ఓ చాంద్'నీ..!!
వెన్నెలంటి నీ సొగసుల ~ వనమేగా భా'వనమౌ..!!
జీ'వనమున మోహాలకు ~ తెర దించిన ఓ చాంద్'నీ..!!
పరిహసించు ఛాన్దసాల ~ పరిపాలన తొలగెనులే..!!
విరివానల పరిమళముల ~ మము ముంచిన ఓ చాంద్'నీ..!!
పెరిగి తరుగు వ్యవహారము లీకంటికె పరిమితములు..!!
విరహమసలు చొరగలేని..తావిచ్చిన ఓ చాంద్'నీ..!!
ఎడారిలో తరలిపోవు..రాకుమారి నా చెలియే..!!
నీ మనసను తరిగిపోని..మధువిచ్చిన ఓ చాంద్'నీ..!!
ఆ'మాధవ' పదసన్నిధి..వలచు జంట పక్షులమే..!!
స'రసాగ్నుల కావ్యలతల..వరమిచ్చిన ఓ చాంద్'నీ..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

నను నిలిపిన ఓ చాంద్'నీ.
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.