Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

604 //
అడవిలోని వెన్నెలలను త్రాగలేరు ఎవరైనా..!!
మొగలిపూల గంధాలను వీడలేరు ఎవరైనా..!!
నిన్నునీవు చీల్చుకుని పుట్టాలిక..ఈ పుడమిని..
నీ ఎదలో చీకట్లను కాల్చలేరు ఎవరైనా..!
అమృతధార కురియు వేళ మొద్దునిద్ర ఎందుకటా..?!
సందేహపు ఆ ముద్రలు చెరపలేరు ఎవరైనా..!
నాకన్నుల మాటునుండి చూస్తున్నది నీవేగా..
నీ చల్లని ఆ చూపులు త్రిప్పలేరు ఎవరైనా..!
వింటున్నా నీ గానం..యుగాలుగా ఓచెలియా..
నా మదిలో ఆ మధురిమ దోచలేరు ఎవరైనా..!
నా మౌనపు కోవెలలో వెలుగుతున్న మహరాణీ..!
నీ నవ్వుల కాంతిపూలు త్రెంచలేరు ఎవరైనా..!
వసంతాల ఊయలనే..ప్రసాదించు ప్రియ సఖియా..!
నీ తియ్యని ఆ సొగసులు పట్టలేరు ఎవరైనా..!
'మాధవు'నకు ఇష్టమైన వేణువంటె నీ సొగసే..
ఓ రాధా నీ వలపులు కాంచలేరు ఎవరైనా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఎవరైనా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.