Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@ముషాయిరా గజల్..21-01-16..02 // 606 //
స్నేహమనే ద్వారమసలు మూయలేరు ఎవరైనా..!
ఆ సూర్యుని కిరణాలను మాపలేరు ఎవరైనా..!
తనను తాను తెలిసేందుకు.. యాతనలే ఎదురౌనే..
అవి తీరక ఎవ్వరినీ చదువలేరు ఎవరైనా..!
తలపుజలధి ఆవిరవక..గమ్యమేల చేరేరట..!
కోర్కెలతో గగనాలను..దాటలేరు ఎవరైనా..!
వసంతాల పరిమళాలు..అల్లుకున్న వేళలలో..
అందమైన స్వప్నాలను..మరువలేరు ఎవరైనా..!
పూలగొడుగు చెలియ మనసు నీడ పట్టి నిలచిందా..
పాటగాక తన చూపును..నిలుపలేరు ఎవరైనా..!
పడవలాగ కదలిపోవు..ఆలోచన ఆగేనా..
మేఘాలను ముద్దాడక..చూడలేరు ఎవరైనా..!
తీర్థాలను తిరుగుచున్న..ప్రేమజంట కోరికలకు..
పగ్గాలను పట్టిపట్టి వేయలేరు ఎవరైనా..!
ఆ రాధకు 'మాధవు'నకు బృందావని ఏదోమరి..!?
వేరుచేసి యమునాతటి చూపలేరు ఎవరైనా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

మూయలేరు ఎవరైనా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.