Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

607..
మేఘాలను చుంబించే ~ కిరణాలకు ఊయలవో..!!
కిరణాలను పాలించే ~ రాగాలకు ఊయలవో..!!
అగ్నివీణ ఎదలోయల ~ విహరించే కలహంసా..!!
సుస్వరముల స్పందించే ~ నాదాలకు ఊయలవో..!!
సాక్షితత్వ మురిపాలను ~ వర్షించే స'రసాంగీ..!!
గగనమ్ముల లాలించే ~ యోగాలకు ఊయలవో..!!
ఈ తనువున అణువణువున ~ నాట్యమాడు భద్రాంగీ..!!
తమకమ్ముల తొలగించే ~ తరుణాలకు ఊయలవో..!!
జన్మమర్మ వేదాలను ~ విశదపరచు విమలాక్షీ..!!
మోహాలను కరిగించే ~ ప్రణయాలకు ఊయలవో..!!
ఆ 'మాధవ' సస్యాలకు ~ క్షేత్రమైన బీజాక్షీ..!!
వైభోగము లందించే ~ చరణాలకు ఊయలవో..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

కిరణాలకు ఊయలవో.
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.