Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ మహల్..04-02.// 609 //
నీ భావన నే నిండుట..ఎంత భాగ్య మీ జన్మకు..!
నీ కుంచెన నే వెలుగుట..ఎంత చిత్ర మీ జన్మకు..!
నన్ను గాక ఏ భామను..తెలియని ఓ చెలికాడా..!
నీ కన్నుల నేనొదుగుట..ఎంత సౌఖ్యమీ జన్మకు..!
బొమ్మగీయు చాతుర్యము..నీ మదిలో ఎలా పొంగె..?!
నీ తలపుల నే మిగులుట..ఎంత మోద మీజన్మకు..!
గున్నమావి తోటకదా..నీ మనసే ఓ ప్రియుడా..!
నీ ఎదలో నే దాగుట..ఎంత అంద మీజన్మకు..!
కనులు మూసి గీతువేల..మనోహరా..నా రూపము..!?
నీ ఊపిరిగా మారుట..ఎంత స్నేహ మీజన్మకు..!
ఆ'మాధవ' ఆరాధను..నేనేనని తెలిసిందా..!?
నీ ప్రేమను నే పొందుట..ఎంత పర్వ మీ జన్మకు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఎంత భాగ్య మీ జన్మకు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.