Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్ కాన్వాస్..42-1.// 610..//
ఇల్లంటే అద్భుతమౌ..ప్రేమ వనము.. ప్రియ నేస్తం..!
ఇల్లాలే అమృత మధుర..రాగ ఫలము.. ప్రియ నేస్తం..!
కన్నతల్లి కన్న మిన్న..ప్రకృతిమాత గమనిస్తే..!
ప్రతి గరికన కలదు కదా..పచ్చ'ధనము' ప్రియ నేస్తం..!
సుస్వరాల సంగీతం..ఉన్నదోయి ప్రతి బుడగన..!
ఆలకించు తత్వమదే..నిత్య సుఖము ప్రియ నేస్తం..!
ప్రతి క్షణమొక ప్రణయ వీణ..జీవితాన పలికిస్తే..!
హృదయవిద్య స్నేహమైతె..అదే ఘనము ప్రియ నేస్తం..!
పిల్లలనే గురువులవలె..భావించుట ముచ్చటలే..!
మురిపాలను పంచుకొనుట..మన ధర్మము ప్రియ నేస్తం..!
'మాధవుడా' లేడు కదా..వేరేగా చూడు మదిని..!
ఆ'రాధగ మారుటయే..శాంతిప్రదము ప్రియ నేస్తం..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ప్రియ నేస్తం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.