Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

615..
పువ్వులా నువ్వలా..నవ్వుతూ ఉండాలి..!
తోడుగా నీడలా..వెలుగుతూ ఉండాలి..!
ఓ చినుకు గూటికే..స్వరముగా నిండగా..
మౌనాల గీతిలా..మ్రోగుతూ ఉండాలి..!
ప్రసవించు ఆవేదన..ప్రణవాన దాగెనే..
చిన్నారి శిశువులా..ఆడుతూ ఉండాలి..!
శ్వాసలో శ్వాసకే..దారమే నీవుగా..!
ఎపుడైనా సాక్షిలా.. ఒదుగుతూ ఉండాలి..!
పలుకుకే పదునువై..రచనలో కురియుమా..!
పాటలో ధారలా..సాగుతూ ఉండాలి..!
'మాధవా' రాధనే..ఏలరా..వీడకే..!
పాలలో వెన్నలా..మసలుతూ ఉండాలి..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నవ్వుతూ ఉండాలి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.