Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

617..
నీ నవ్వుల పసిడివాన..కురుస్తుంటె చూస్తున్నా..!
ఆ వానన నా మనస్సు..తడుస్తుంటె చూస్తున్నా..!
నా తియ్యని హృదయ లయన..సరిగమలే పొదిగినావు..!
నీ తలపుల వీణ ఎదో..పిలుస్తుంటె..చూస్తున్నా..!
కొమ్మలలో రాచిలుకల..అనురాగపు పరిమళమా..!
నీ ముద్దుల పానుపేమొ..తలుస్తుంటె..చూస్తున్నా..!
అక్షరాల కోవెలలో..మౌనదీప సోయగమా..!
నీ శ్వాసయె దీవెనగా..మెరుస్తుంటె..చూస్తున్నా..!
మట్టి గుండె గొంతులోన..నర్తించే పరాగమా..!
పూలచేతులెత్తి నీవు..కొలుస్తుంటె.. చూస్తున్నా..!
'మాధవు'నకు ఇష్టమైన..బృందావని నీ కొరకే..!
సాక్షిలాగ నన్ను నీవు..మలుస్తుంటె..చూస్తున్నా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

కురుస్తుంటె చూస్తున్నా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.