Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@గజల్ మహల్ 05-03 // 619 //
పరమశివా..రావేరా..నా ప్రియుడై నన్ను చేర..!
నీతో నే..కళ్యాణము..ప్రియ వరుడై నన్ను చేర..!
అందెనురా నీ లేఖలు..సుకుమారా ఇక హాయే..!
నా నోములు పండెను..రా..నువు సఖుడై నన్ను చేర..!
మనవి వృత్తి..ప్రవృత్తులే..ఒకటైనవి ఆనందం..!
ముహూర్తమే పిలిచెను..రా..మన్మథుడై నన్ను చేర..!
దోచినావు నా మనసే..నీ తియ్యని పలుకులతో..!
వేచియుందు ప్రియమా..రా..నువు విభుడై నన్ను చేర..!
మన చదువుల పరమార్థము..నిరూపించు వేళాయెను..!
మరి ఇంకా జాగా..రా..నా శివుడై నన్ను చేర..!
నీ చెలిమిని వేడుకొందు..అక్షరాల అర్చింతును..!
నా హృదయమె వేణువు..రా..'మాధవు'డై నన్ను చేర..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నా ప్రియుడై నన్ను చేర
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.