Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@గజల్ కాన్వాస్-43-01.// 622 //
ఊహ మాటు మధురిమలను..అందించిన ప్రియంవదా..!
మౌనరాగ శిల్పలతగ..లభియించిన ప్రియంవదా..!
ఎద వీణను నీవు మీటు..తీరేమో చిత్రమాయె..!
భావనమున స్వరమధువే..పొంగించిన ప్రియంవదా..!
సిద్ధాంతములన్ని రద్దు..గోర్వెచ్చని నీ ముద్దుకు..!
నా ప్రేమను తెలుసుకుని..లాలించిన ప్రియంవదా..!
పాటలిసుమ పరిమళమే..నీ తియ్యని చూపు వాన..!
కలహంసల కలాపాల..తేలించిన ప్రియంవదా..!
నీ సన్నిధి లోని హాయి..ఏ జన్మకు మరువజాల..!
మన చెలిమికి చిరునామా..పండించిన ప్రియంవదా..!
ఆ 'మాధవ' గానసాక్షి..బృందావన వాసంతం..!
పుష్కళముగ నాకొరకే..వర్షించిన ప్రియంవదా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ప్రియంవదా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.