Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@గజల్ కాన్వాస్..43-02.// 623 //
నా జన్మల చీకటులే.. తొలగినాయి.. నీ దయతో..!
నా మనస్సు బడలికలే..తీరినాయి.. నీ దయతో..!
నీ ఒడిలో ఇంతచోటు..దొరికినదే ఓ చెలియా..!
నా ఎదలో వెన్నెలలే..నిండినాయి..నీ దయతో..!
ఈ హాయిని వివరించగా మాటలసలు చాలవులే..!
బహుతియ్యగ ఈ రెప్పలు..వాలినాయి.. నీ దయతో..!
నీ లాలనలోన గాక..మరి స్వర్గము ఉందెక్కడ..?!
అర్థవంతమైన కలలు..పండినాయి.. నీ దయతో..!
కనులు తెరచి చూసేందుకు..ఏమున్నది ఈ జగాన..!?
మౌనగగన సౌరభాలు..అందినాయి.. నీ దయతో..!
అపురూపత చిరునామా..ఆ 'మాధవ' సొంతములే..!
మన కలయిక శ్వాసలెల్ల..మురిసినాయి.. నీ దయతో..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నీ దయతో.
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.