Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

625..
వెక్కిరించు గాలిపటం..దారమేదొ..దొరికిందా..!?
వినోదాల పూలపడవ..మూలమేదొ..దొరికిందా..!?
సంస్కారపు వాసనలకు..ద్వారమైన మనసు చూడు..!
కలహంసల ఆ నవ్వుల..చిత్రమేదొ.. దొరికిందా..!?
భయమెందుకు..నిన్ను నీవు తెలుసుకొనగ తరుణమిదే..!
గుండె లయల సవ్వడులకు..ఛత్రమేదొ..దొరికిందా..!?
పేజీలను తిరగేస్తూ..ఎన్ని కథలు ఎంత తడవు..!?
ఈ తియ్యని క్షేత్రానికి..బీజమేదొ...దొరికిందా..!?
పరవశాల మధుశాలగ..తనువున్నది జన్మలుగా..!
అద్భుతమౌ అనుభవాల..సాక్ష్యమేదొ..దొరికిందా..!?
ఆ 'మాధవ' మందహాస..చందనమే నీవు సుమా..!
నీ శ్వాసల సంతకాల..అద్దమేదొ..దొరికిందా..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

దొరికిందా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.