Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@..గజల్ కాన్వాస్..౪౩-౦౩..// 626 //
మరువలేని ఈ హాయిని..ఉండనిమ్ము మన నడుమన..!
మదిలోపలి కలలన్నీ..కరగనిమ్ము మన నడుమన..!
కష్టమైన సుఖమైనా..భావింతము చెరిసగముగ..!
నీ తియ్యని అనురాగం..పండనిమ్ము మన నడుమన..!
ఈ జన్మకు నీ సన్నిధి..దొరుకుటయే వరము సఖీ..!
నవ వసంత సరాగాలు..నిండనిమ్ము మన నడుమన..!
తల్లి, తండ్రి, గురువు అన్ని..నీవే చెలి నా పాలిట..!
కాలాలను లాలిపాట..పాడనిమ్ము మన నడుమన..!
పుట్టబోవు పాపాయికి..నీ పోలిక రావాలట..!
తన నవ్వుల పూవులెల్ల..చల్లనిమ్ము మన నడుమన..!
ఆ’మాధవ’ దీపమల్లె..ఎదుగునులే చిట్టిపాప..!
అందమైన బృందావని..నిలువనిమ్ము మన నడుమన..!


మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

పండనిమ్ము మన నడుమన
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.