Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

627..@మాస్టర్ వాహెద్ గారికి..ధన్యవాదములతో..
కంటిలో వెలుగుకే..మూలమైన నేస్తమా..!
గుండెలో ప్రేమకే..దారమైన నేస్తమా..!
పంచరా స్నేహమే సమయమే చూడక..!
పువ్వంటి నవ్వుకే..ప్రాణమైన నేస్తమా..!
మాటకే పరిమళం..కూర్చురా మౌనమే..! 
ప్రగతికే సత్యమౌ..దీపమైన నేస్తమా..!
ధర్మమే దారిగా..సాగుటే కష్టమా..?!
మధురమౌ మెరుపుకే..మేఘమైన నేస్తమా..!
ఓ పిలుపు ఇవ్వగా..గాత్రమే అవ్వరా..!
బ్రతుకులే పండగా..ఛత్రమైన నేస్తమా..!
మానవా.. ‘మాధవు’ని..చూడరా లోపలే..!
రాగమే వీడగా..గగనమైన నేస్తమా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నేస్తమా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.