Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

@..04-02-2016 ముషాయిరా గజల్..// 629 //
మధు ''మాధవ'' చెలిమిసాక్షి.. చైత్రాలను ఆపలేము..!
నవమోహన నాట్యగతుల..తేజాలను ఆపలేము..!
ప్రణయరాగ మధురిమలకు అద్దమేమి ఉండదులే..
చూపులోన అనురాగపు నాదాలను ఆపలేము..!
హంసయాన నడకలలో తొంగిచూచు హొయలులెన్నొ..
ప్రియ సొగసరి చిలిపితనపు జగడాలను ఆపలేము..!
కలతతీర్చు చెలి పలుకుల లాలనయే ముద్దుకదా..!
కరువయ్యిన వేళలలో దాహాలను ఆపలేము..!
ప్రేమమేఘమాల చూడ..అలిగెనేమొ తెలియదుగా..
అందమైన ప్రియ భావన..సంద్రాలను ఆపలేము..!
ప్రియుని కొరకు ఎదురుచూచు అభిసారిక మనసేమో..?!
ఆ హృదయపు కోవెలలో..పరువాలను ఆపలేము..!
నిదురించని వలపుతోట..వికసించిన తీరేమో..!?
రాచిలుకల కలరవాల..కథనాలను ఆపలేము..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

చైత్రాలను ఆపలేము
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.