Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

4609..గజల్ 
ఆత్మీయ గజల్ ప్రియ నేస్తాలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలతో.. ?‍♂️????????????
బంగారు మా తల్లి..అందాల తంగేడు..! 
తెలంగాణా రాష్ట్ర..భాగ్యాల తంగేడు..! 
ఎన్నెన్ని బాధలో..తొలగించు ఔషధం.. 
బతుకమ్మ పూజలో..పుణ్యాల తంగేడు..! 
అడవిలో విహరించ..ఆరోగ్యమని చాటు.. 
దుర్గమ్మ దీవనల..గంధాల తంగేడు..! 
నవశక్తి నిధిచూడ..పట్టుకుని పుట్టెనే.. 
తెలుగుజన పదములకు..విజయాల తంగేడు..! 
మాయహరి తిమిరహరి..ఈ గొబ్బి తల్లిరో.. 
గాలిలో గాలికే..ప్రాణాల తంగేడు..! 
సంక్రాంతి ముగ్గుల్లొ..చేరి అలరించేను.. 
నవరాత్రి అర్చనల..దసరాల తంగేడు..! 
చరమరంగ మధుర..మాధవుని కేషియా.. 
ఉయ్యాల కోలాట..సరసాల తంగేడు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

అందాల తంగేడు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.