Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

4603..గజల్. 
తీరిక లేదని చెప్పను..చదివేందుకు టైములేదు..! 
ఎవరేమనుకున్నా సరె..ఆగేందుకు టైములేదు..! 
"పదండి ముందుకు పదండి తోసుకు పైపైకి"
అన్నవాడె గొప్పవాడు..తలచేందుకు టైములేదు..! 
రామాయణ భారత భాగవత కథలెందు కింకా.. 
కనిపడేసిన వారినే..చూసేందుకు టైములేదు..! 
ఎవరిష్టం వారిదేను..కాదంటే యుద్ధమేను.. 
శాంతిపాఠ మేమున్నది..నవ్వేందుకు టైములేదు..! 
ఏదైనా మితిమీరిన..అనర్థమే ఎపుడైనా.. 
నీతులిలా ఉంటాయని..చెప్పేందుకు టైములేదు..! 
అందమైన రాచిలుకల..తోటకదా మనసన్నది.. 
ఆలోచన మూలమేదొ..పట్టేందుకు టైములేదు..! 
మౌనగగన తీర్థం నీ..గజలేనోయ్ మాధవుడా.. 
గానగంధర్వులకేమొ..పాడేందుకు టైములేదు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

చదివేందుకు టైములేదు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.