Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

4583..గజల్. 
నీ చూపుల వెన్నెలనే..మరువలేని వెర్రిని..! 
ప్రేమకు ఒక నిర్వచనం..చెప్పలేని వెర్రిని..! 
నిదుర రాని రేయికన్న..భాగ్యమేమి ఉండును.. 
నీ తలపుల మధువన్నది..వదలలేని వెర్రిని..! 
రావాలని నీకున్నా..రాలేవు తెలుసు నాకు.. 
నీకోసం పడిగాపులు..మానలేని వెర్రిని..! 
నీ నవ్వుల మల్లెచెండు..వాడిపోనిదో సఖీ.. 
వేదించే దిగులుతోట..నిలువలేని వెర్రిని..! 
లేఖలోన తెలుపుటెలా..మనసుపడే యాతన.. 
వలపుపాట వినిపించక..బ్రతుకలేని వెర్రిని..! 
చుట్టుకున్న చీకటినే..ప్రేయసిగా తలచితి.. 
చితిచేరగ విరహమునే..ఓపలేని వెర్రిని..! 
నా మాధవ గజల్ మాటు..మౌనంలో నీవే.. 
నీ పదముల సాక్షి గాక..ఉండలేని వెర్రిని..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

మరువలేని వెర్రిని
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.