Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

గజల్..
ఈ రోజే తమ భూలోక యాత్ర పూర్తిచేసుకున్న ఆత్మబంధువు శ్రీ Dhyanamahachakram Nanda   జీకి స్నేహాక్షర నివాళి..?????????????
పలుకుతేనె వెలుగుపూల..వనములోన ఉన్నావుగ..! 
ధ్యాన జగదా'నంద'వై..మెఱుపులోన ఉన్నావుగ..! 
అక్షరాల పత్రీజీ..ఆశయాల యోగీశ్వర.. 
మనపిరమిడ్ మాస్టర్లకు..మనసులోన ఉన్నావుగ..! 
పియమ్సీకి సారథివై..ఎంతశక్తి నింపావో.. 
సహసృష్టికర్తల ముందు..ఎత్తులోన ఉన్నావుగ..! 
నిత్యముక్త కర్మయోగి..నీవేనని చెప్పాలా.. 
హిమవన్నగ యాత్రార్థుల..వెన్నులోన ఉన్నావుగ..! 
కర్తవ్యకర్మ వర్తనలో నిమగ్నుడవోయ్ సదా.. 
నందా దీపంలా మా..ఓర్పులోన ఉన్నావుగ..! 
అడుగడుగున చలాకీగ..సాగిపోవు యాత్రికుడా.. 
నందగోపబాలా మా..నవ్వులోన ఉన్నావుగ..! 
బ్రహ్మర్షి పితామహుడే..మాధవుడై మెచ్చినాడె.. 
పాలపుంతలే దాటే..రథములోన ఉన్నావుగ..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

వనములోన ఉన్నావుగ
ఆత్మబంధువు శ్రీ Dhyanamahachakram Nanda
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.