Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

4568..గజల్. 
అన్నివిద్యలు గూగులమ్మయె..నేర్పుగురువే తోడుగా..! 
ఎల్లవేళల తెఱచియున్న..మేటి కొలువే తోడుగా..! 
ఏది ఎంచుకు చేయదలచిన..తగిన జ్ఞానం అందునే..
ఉత్సుకతయే ఉన్నచాలును..కల్పతరువే తోడుగా..! 
ఎన్నిచరితలు జ్ఞాపకాలను..నిల్వచేసెను నేస్తమై.. 
శ్రద్ధ ఉంటే ఆటపాటల..గొప్ప దరువే తోడుగా..! 
మాయచేయు అంతర్జాలపు..మహిమ ఇంతని చెప్పుటా.. 
సహననిధులకు శక్తినిచ్చే..మౌనమధువే తోడుగా..! 
ప్రజ్వరిల్లే ప్రతిభలెన్నో..స్ఫూర్తినివ్వగ నిలిపెనే.. 
కొలువులెన్నో తెలియజేసే..మంచి సులువే తోడుగా..! 
ఆర్డరివ్వగ గడపలోకే..అన్ని వచ్చే తీరులే.. 
ఎన్ని యాపులొ ఎంతహాయో..తెలివివిలువే తోడుగా..! 
ఎక్కడైనా ప్లస్సుమైనసు..లుండునోయీ మాధవా.. 
మెలకువన్నది కలిగియుండగ..మనసు లగువే తోడుగా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

నేర్పుగురువే తోడుగా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.